బీటెక్/ఎంటెక్‌ అర్హతతో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే

0
106

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ARCI).. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పూర్తి వివరాలు మీకోసం..

మొత్తం ఖాళీల సంఖ్య: 19

పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌, ఏఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.31,000ల నుంచి రూ.47,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ/తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఏఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ/తత్సమాన డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గెట్‌/నెట్‌ స్కోర్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2022