డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే

0
92

డిగ్రీ పాస్ అయిన వారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 2022 మార్చి 8లోగా దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్‌బీఐ. హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో 40 ఖాళీలు ఉన్నాయి.

ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మల్టిపుల్ ఛాయిస్‌లో ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సమయం 60 నిమిషాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. ప్రతీ సెక్షన్‌కు 20 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గుతుంది.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినవారికి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మల్టిపుల్ ఛాయిస్‌లో ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 135 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 25 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. ప్రతీ తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గుతుంది.

మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినవారికి లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థి అప్లై చేసిన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో ఈ పరీక్ష ఉంటుంది. హైదరాబాద్ రీజియన్‌లోని పోస్టులకు అప్లై చేసినవారికి తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఉంటుంది.