భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలోనున్న మిలిటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME) తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ పోస్టులను అబ్సార్ప్షన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అటెండెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.14,950ల నుంచి రూ.18,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు:
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: MCEME, Trimulgherry (P.O), Secunderabad, Telangana.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.