రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..అప్లై చేసుకోండిలా..

Jobs without written test .. Apply ..

0
130

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లో ఉన్న సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు దరఖాస్తు చేసుకోండిలా..

మొత్తం ఖాళీలు: 311

ఫ్యాకల్టీ పోస్టులు: 77, సూపర్ స్పెషలిస్టు పోస్టులు: 11, జూనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు: 20, స్పెషాలిటీ స్పెషలిస్టు పోస్టులు: 5, సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు: 97, సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు (బ్రాడ్‌ స్పెషాలిటీ): 28 వున్నాయి. అలానే జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు: 23, జూనియర్‌ రెసిడెంట్ పోస్టులు (బ్రాడ్‌ స్పెషాలిటీ): 37 వున్నాయి.

అర్హత:

అభ్యర్ధుల వయసు 45 ఏళ్లు మించరాదు. ఇక ఎవరు అర్హులు అనేది చూస్తే.. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీ, మెడికల్‌ పీజీ/పీజీ డిప్లొమా/ఎండీ/ఎంఎస్‌/పీహెచ్‌డీ చేసి ఉండాలి. అదే విధంగా అనుభవం కూడా ఉండాలి.

శాలరీ విషయానికి వస్తే.. నెలకు 60,000ల నుంచి 2,80,254ల వరకు చెల్లిస్తారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. అకడమిక్‌ మెరిట్, అనుభవం, నీట్‌ స్కోర్‌ 2021 ఆధారంగా అభ్యర్ధులను సెలెక్ట్ చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 17, 2022. పూర్తి వివరాలను https://www.esic.nic.in/ లో చూడచ్చు.