హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి యూజీసీ నెట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.nmdc.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఖాళీల సంఖ్య: 22
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.50,000లు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే యూజీసీ నెట్ డిసెంబర్ 2022, జూన్ 2021లో అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: యూజీసీ నెట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.500
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 17, 2022.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nmdc.co.in/