Breaking News : జూన్ 1 నుంచి తిరుమల – అలిపిరి నడక మార్గం మూసివేత

tirumala alipiri tirupati footpath alipiri alipiri footpath tirupati footpath alipiri closed tirupati footpath alipiri closes

0
239

 

వచ్చే జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని టిటిడి అధికారులు మూసివేయనున్నారు.

అలిపిరి నడక మార్గం మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ నడక మార్గం డ్యామేజ్ అయింది. ఈ మరమ్మతులు చేపట్టే ఉద్దేశంతో జూన్, జులై రెండు నెలల పాటు నడక మార్గాన్ని మూసివేయనున్నట్లు టిటిడి ప్రకటించింది.

అయితే కాలినడకన తిరుమల చేరుకోవాలనుకునే భక్తులు ఎవరైనా శ్రీవారి మెట్టు మార్గం గుండా చేరుకోవాలని సూచించింది. శ్రీవారి మెట్టు మార్గానికి భక్తులు చేరుకునేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు.