కాబోయే కోడలే తన కుమార్తె అని తెలిసి షాకైన అత్తగారు – ప్రపంచంలోనే అరుదైన సంఘటన

కాబోయే కోడలే తన కుమార్తె అని తెలిసి షాకైన అత్తగారు - ప్రపంచంలోనే అరుదైన సంఘటన

0
101

ఇక్కడ జరిగిన ఘటన వింటే ఆశ్చర్యపోతారు, చైనాలోని జియాంగ్సూ ప్రావీన్స్లో మార్చి 31న ఓ పెళ్లి జరిగింది..

అయితే వధువు చేతికి ఓ పుట్టుమచ్చ ఉంది.. అది పెళ్లి కొడుకు తల్లి చూసి ఆమె డీటెయిల్స్ అన్న్నీ మరోసారి పెళ్లికుమార్తె పేరెంట్స్ ని అడిగింది.. దీంతో ఆమె తన కూతురు అని తేలింది… ఇక కోడలుగా రాబోతున్న అమ్మాయి కూతురు అని తెలిసి ఆమె చాలా ఆనందించింది…మరి స్టోరీ ఏమిటి అంటే.

 

20 ఏళ్ల కిందట తన కుమార్తె తప్పిపోయిందని, ఇప్పటివరకు ఆమె ఆచూకీ తెలియలేదని తెలిపింది. ఈ సమయంలో ఈ అమ్మాయిని వేరే వారు పెంచుకున్నారు, ఇలా పెద్ద చేసి పెళ్లి చేస్తున్నారు, అయితే ఇప్పుడు ఆమె ఏకంగా తన ఇంటికి కోడలు అవుతోంది… మరి వరుడికి చెల్లి వరుస అవుతుంది కదా పెళ్లి ఎలా అని అనుకుంటున్నారా.

 

ఇక్కడ మరో విషయం ఉంది….తన కూతురు తప్పిపోయిన తర్వాత తనకు మళ్లీ పిల్లలు పుట్టలేదని, దీంతో వరుడిని దత్తత తీసుకున్నానని తెలిపింది. ఇక ఈ సీక్రెట్లు రెండూ పెళ్ళిలోనే తెలిశాయి… ఇక పెళ్లి కూతురు కూడా చాలా ఆనందించింది, మొత్తానికి ఈ ఘటన దేశంలోనే ప్రపంచంలోనే పెను వైరల్ అయింది.