కాబోయే కోడలిపై మామ అత్యాచారం

కాబోయే కోడలిపై మామ అత్యాచారం

0
94

ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల సాక్షిగా ఒకటి అవ్వాలని అనుకున్నారు. ఈ క్రమంలో తమ తమ ఇళ్లలో పెద్దలకు విషయం చెప్పారు. ఇక్కడే వాళ్ల ప్రేమలో ఊహించని మలుపు తిరిగింది.

సహజంగా పిల్లల ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక తండ్రి మాత్రం కొడుకు ప్రేమను ససేమిరా అన్నాడు. కొడుకు కూడా అ ఆ అమ్మాయి లేకపోతే బ్రతకలేను అన్నాడు. దీంతో ఆ అమ్మాయి నుంచి తన కొడుకుని ఎలాగైనా వేరు చేయడానికి పక్కా ప్రణాళిక రచించాడు.

ప్రేమను ఒప్పుకున్నట్లు నటించి అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి తండ్రి వెళ్ళాడు. ఇద్దరికీ పెళ్లి చేస్తానని అమ్మాయికి చెప్పి, తనవెంట రమ్మని అమ్మాయిని కోరాడు. కాబోయే మామయ్య, ప్రేమించిన వ్యక్తి తండ్రే కదా అని గుడ్డిగా నమ్మింది. దీంతో మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం చేసి బలవంతంగా తాళి కట్టాడు. ఈ దారుణం తమిళనాడులో నాగపట్నం జిల్లాలో చోటు చేసుకుంది.