కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా? ప్రకృతి వైపరీత్యమా?

0
92

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా? ప్రకృతి వైపరీత్యమా అనే దానిపై చర్చ జరిగింది. అయితే ప్రాజెక్ట్ ముంపు పై నిజాలు నిగ్గు తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్బంగా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు విషయంలో ప్రకృతి వైపరీత్యానికి మానవ తప్పిదం తోడైంది. రెండు పంపులు మునిగేసరికి లక్ష కోట్లు మునిగాయనడం కరెక్ట్ కాదు. కాకపోతే ప్రస్తుతం ప్రాజెక్టు రన్ కాలేదు. ప్రాణహిత- చెవేళ్ల వయబుల్ కాకపోతే..కాళేశ్వరం కూడా కానట్లే. ఒక స్టేజ్ లో ఏ లిఫ్ట్ అయినా మూడు స్టేజ్ లు దాటితే వయబుల్ కాదు. కానీ తెలంగాణ కు లిఫ్ట్ ల ద్వారానే నీళ్లు వస్తాయి.

మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకోని కారణంగా కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు చేపట్టాల్సి వచ్చింది. కాళేశ్వరంకు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇచ్చారు. టెక్నికల్ గా ఎలాంటి తప్పిదాలు లేవు. అన్నారం పంపింగ్ స్టేజ్ 130 మీటర్ల వద్ద ఉంటే… వరద 131 మీటర్ల వరకు వచ్చింది. దీని వల్లే మంథని పట్టమంలోకి నీళ్లు వచ్చాయి. ఎత్తి పోతల పథకం సలహాదారు పెంటారెడ్డి పై కొందరు విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్ని పెంటారెడ్డి చలువే. తుమ్మడిహెడ్డి నుంచి ప్రాణహిత -చేవెళ్ల 9 లిఫ్ట్ ల స్కీం..దాన్ని పూర్తి చేయాలనుకుంటే 95 వేల కోట్లు ఖర్చు అయ్యేది. కాళేశ్వరం, ప్రాణహిత చేవెళ్ల రెండు కూడా సేమ్ కాస్ట్ అన్నారు. రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తామని అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు.