కామద ఏకాదశి అంటే ఏమిటి ? ఈ రోజు ఎవర్ని పూజించాలి

కామద ఏకాదశి అంటే ఏమిటి ? ఈ రోజు ఎవర్ని పూజించాలి

0
85

మన హిందూ సంప్రదాయాల్లో అనేక రకాల పూజలు ఉంటాయి, ఇక మనకు ప్రతీ నెలలో రెండు ఏకాదశిలు వస్తూ ఉంటాయి అనేది తెలిసిందే… దానికి ఓ ప్రత్యేకత కూడా ఉంటుంది…చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉంది. దీనినే కామద ఏకాదశి లేదా దమన ఏకాదశి అని చెబుతారు, ఇక ఏప్రిల్ 23 న కామద ఏకాదశి.

 

 

మరి ఈ దమన ఏకాదశికి ఉన్న ప్రత్యేకత చూద్దాం. పూర్వం పుండరీకుడు అనే రాజు కొలువులో, ఓ గంధర్వుడు ఉండేవాడు. ఒకసారి ఆ గంధర్వుడు తన పట్ల నిర్లక్యంగా వ్యవహరించాడనే కోపంతో, రాక్షసుడిగా మారిపొమ్మని ఆ రాజు శపిస్తాడు. దీంతో ఆ గంధర్వుడు రాక్షసుడిగా మారిపోతాడు, ఈ సమయంలో ఆ గంధర్వుడి భార్య కామద ఏకాదశి వ్రతం చేస్తుంది, ఇక ఆ ఫలితంతో అతను రాక్షసుడి రూపు నుంచి గంధర్వుడు తన యధా రూపుకి వస్తాడు.

 

ఈ పవిత్రమైన రోజున మహిళలు తమ సౌభాగ్యాన్ని కాపాడాలని ఆ విష్ణువుకు పూజలు చేస్తుంటారు. ఈ రోజులు ఆ విష్ణువుని కొలుస్తూ హోమాలు వ్రతాలు నోములు పూజలు చేస్తారు. ఈరోజు మనం ఈ పూజ చేస్తే మన జీవితంలో తెలియక చేసిన పాపాలు పోతాయి అని చెబుతారు పండితులు.