కన్నకూతురిపై తండ్రి లైంగిక దాడి కోర్టు ఏం శిక్ష వేసిందంటే

కన్నకూతురిపై తండ్రి లైంగిక దాడి కోర్టు ఏం శిక్ష వేసిందంటే

0
110

తల్లి తండ్రి దగ్గర ఉంటే ఏ కూతురు అయినా సేఫ్ గా ఉంటాను అని అనుకుంటుంది …కాని తండ్రి కామాంధుడై తన కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడితే… ఇక ఎంత దారుణం…. ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది, తమిళనాడులో ఓ కసాయి తండ్రి స్నేహితులతో కలిసి కన్నకూతురిపై లైంగిక దాడి చేశాడు.

 

2019లో జరిగిన ఈఘటనలో నేరం రుజువవటంతో ప్రధాన నిందితుడైన తండ్రికి కోర్టు శిక్ష విధించింది, ఆమె తండ్రికి 60 ఏళ్లు శిక్ష విధించారు, అంతేకాదు ఆ సమయంలో రాక్షసుల్లా ప్రవర్తించిన అతని మిత్రులకి కూడా 40 ఏళ్లు కోర్టు శిక్ష విధించింది.

ఈరోడ్ జిల్లా గోబిసమీప గ్రామానికి చెందిన బాలిక తండ్రి తమ్ముడితో కలిసి ఉంటోంది.

 

ఇక ఇతను పెట్టిన హింసలు తట్టుకోలేక అతని భార్య వదిలివెళ్లిపోయింది. 2019లో బాలిక తండ్రి, తన స్నేహితులైన అరుణాచలం మణికంఠన్ లతో కలిసి బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. మొత్తానికి విచారణ తర్వాత కోర్టు వీరి ముగ్గురికి ఈ శిక్ష విధించింది.