క‌న్న‌కూతుర్ని రూ. 50 వేల‌కు అమ్మేశాడు ఈ దుర్మార్గ‌పు తండ్రి

క‌న్న‌కూతుర్ని రూ. 50 వేల‌కు అమ్మేశాడు ఈ దుర్మార్గ‌పు తండ్రి

0
131

ఎవ‌రైనా క‌న్న కూతుర్ని కంటికి రెప్ప‌లా చూసుకుంటారు, కాని ఈ మూర్ఖుడు అస‌లు తండ్రి అన‌డానికి ఆపేరుకు అనిర్వ‌చ‌నీయుడు అనే చెప్పాలి, ఏకంగా త‌న కూతుర్ని అమ్మ‌కానికి పెట్టాడు, ఈ దారుణం చిత్తూరు జిల్లాలో జ‌రిగింది.

వెంకటరమణ అనే వ్యక్తి.. పందులు పెంచుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అతడికి నలుగురు కుమార్తెలు కాగా.. వీరిలో ఇద్దరికి పెళ్లిళ్లు చేశాడు. ఇక ఓ వ్య‌క్తి గ‌తంలో ఆమె మొద‌టి కుమార్తెని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కుద‌ర‌క వేరే వివాహం చేశాడు, రెండో కుమార్తెని అడిగాని ఇవ్వ‌లేదు ఆమెకి వేరే వివాహం చేశాడు తండ్రి.

ఇప్పుడు మూడో కుమార్తె వ‌య‌సు 12 ఏళ్లు ఆమెపై క‌న్నేశాడు, త‌న‌కు ఇచ్చి పెళ్లి చేయాలి అని కోరాడు ఏకంగా ఎదురు క‌ట్నం 50 వేలు ఇస్తాన‌ని ఆశ‌చూపాడు.. దీంతో.. రహస్యంగా.. పెళ్ళిచేయడానికి ఒప్పుకున్నాడు తండ్రి. ఈ విష‌యం స్ధానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు, వెంట‌నే రంగంలోకి పోలీసులు వ‌చ్చారు, సీన్ ఇక్క‌డే మారిపోయింది.