కన్న బిడ్డని అమ్మేసి ఆ డబ్బుతో ఈ తండ్రి ఏం చేశాడంటే

కన్న బిడ్డని అమ్మేసి ఆ డబ్బుతో ఈ తండ్రి ఏం చేశాడంటే

0
126

కొందరు తల్లిదండ్రులు పిల్లలని కంటారు , కాని చివరకు వారికి ఏడాది కూడా రాకుండానే అమ్మేస్తుంటారు, అయితే వారి సౌఖ్యాల కోసం డబ్బు కోసం ఈ మధ్య ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటున్నారు పోలీసులు.

ఇలాంటి వారు చాలా మంది పోలీసులకు చిక్కారు.. ఇటీవల ఓ మహిళ తన బిడ్డని 5 లక్షలకు అమ్మేసింది.. అలాగే మరో తండ్రి తనకుమారుడ్ని 8 నెలల బిడ్డని రెండు లక్షలకు అమ్మేశాడు. చివరకు పోలీసులకు చిక్కారు.

ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది.మూడు నెలల వయసున్న పనికందును అమ్మేశాడు ఈ తండ్రి.. ఆ డబ్బుతో ఓ బైక్, స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

ఆ నగదుతో విలాసాలు చేశాడు బిడ్డ లేకపోవడంతో అనుమానంతో ప్రశ్నిస్తే అసలు నిజం తెలిసింది..మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు ఆ చిన్నారిని కాపాడారు. కన్న కూతురిని ఆ నిందితుడు లక్ష రూపాయలకు సంతానం లేని దంపతులకు అమ్మేశాడని తెలిసింది

ఆ నగదు తెచ్చి రూ. 50 వేలు పెట్టి ఓ బైక్, మరో రూ. 15 వేలు పెట్టి ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడని ఇక బిడ్డని ఇవ్వాలి అని కోరడం , నన్ను బెదిరించడంతో అతని భార్య కూడా అతనికి బిడ్డని ఇచ్చేసింది. అయితే ఇప్పుడు అతను పారిపోయాడు, అతనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.