మనం పూజలు చేసే సమయంలో గుడిలో ఇంటిలో హోమాల దగ్గర కర్పూరం వెలిగిస్తాం, ఆ స్వామికి హారతి ఇస్తాం, కచ్చితంగా కర్పూరం లేని పూజ వ్యర్దం అంటారు పెద్దలు పండితులు, అందుకే మన దేశంలో ప్రతీ పండుగకు కర్పూర హారతి ప్రధానమైనది అని భావిస్తారు.
కర్పూరం ఆందోళనలు, నిరాశ, నిస్పృహలను దూరం చేసి పాజిటివ్ ఎనర్జీ నింపుతుందట. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా మనశ్శాంతి లేకపోయినా ఇంటిలో రోజూ దేవుడికి కర్పూరం వెలిగిస్తే సమస్యలు దూరం అవుతాయి.
సాయంత్రం వేళ సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో కర్పూర దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం నుంచి వచ్చే పొగ ఇంట్లో మొత్తం వ్యాపించేలా అంతటా తిరగాలి. దీని వల్ల ఇంటిపై నరగోల ఉన్నా తగ్గుతుంది, అలాగే లక్ష్మీ కటాక్షం చూపిస్తుంది..అంతేకాదు రాహు కేతు సమస్యలు దూరం కావాలన్నా ఇంట్లో ప్రతి రోజు కర్పూర హారతి వెలిగించాలి.. కర్పూరాన్ని ఏనాడు వెనుక గుమ్మంలో వెలిగించకూడదు, మండే పొయ్య, గ్యాస్ నుంచి వెలిగించి ఆ మంటలో కర్పూరం వెలిగించవద్దు, ఇక పురుషులు రోజూ ఇలా హారతి ఇస్తే ఇంటికి ఎంతో శుభం, వ్యాపారంలో అభివృద్ది కలుగుతుంది.