కార్తీకమాసంలో 7 రోజులు ఇలా 7 రకాల వత్తుల దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం

కార్తీకమాసంలో 7 రోజులు ఇలా 7 రకాల వత్తుల దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం

0
110

కార్తీకమాసం నెల రోజులు కచ్చితంగా నిత్యం దీపం వెలిగించేవారు ఉంటారు, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా చాలా మంది ఆవునెయ్యితో దీపాలు వత్తులు వెలిగిస్తారు.మరి ఏ రోజు ఎలాంటి వత్తులు వెలిగిస్తే మంచిది అనేది చూద్దాం, ఇలా చేస్తే పండితులు చెప్పేదాని ప్రకారం చాలా మంచిది.

ఆదివారం – పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు
సోమవారం – అరటి దూటతో నేసిన వత్తులు ఇవి నూనెలో నానబెట్టి వెలిగించాలి
మంగళవారం – కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
బుధవారం – పసుపు, గంధం, పన్నీరు కలిపినవత్తులు
గురువారం – కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
శుక్రవారం – పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
శనివారం – తామర తూడుతో నేసిన వత్తులు

ఇలా ఒక్కోరోజు ఒక్కో రకంగా వత్తులు నానబెట్టి వెలిగిస్తే చాలా మంచిది అంటున్నారు పండితులు, లేదా సాధారణంగా ప్రమిదలో ఆవునెయ్యి వేసి నానబెట్టి వాటిని వెలిగించవచ్చు.