కార్తీకమాసంలో ఈ పనులు ఎట్టి పరిస్దితిలో చేయద్దు చాలా పాపం

కార్తీకమాసంలో ఈ పనులు ఎట్టి పరిస్దితిలో చేయద్దు చాలా పాపం

0
130

కార్తీకమాసంలో ఈ నెల రోజులు దేవుని ఆరాధనలో ఉంటారు అందరూ, నోములు వ్రతాలతో ప్రతీ ఇండ్లు సందడిగా ఉంటుంది, ముఖ్యంగా ఈ నెల రోజులు మాంసాహారం గుడ్డు అస్సలు తినకూడదు, అంతేకాదు ఈనెల రోజులు ఉల్లిపాయ వెల్లుల్లి నీరు ఉల్లి అస్సలు తినరు, ఏ జంతువుకి హాని తలపెట్టకూడదు, ముఖ్యంగా ఈనెల రోజులు ఎక్కడకు వెళ్లినా ఎవరి ఇంటికి వెళ్లినా కాళ్లు శుభ్రంగా కడుక్కుని వెళ్లాలి, ఇది పూజా ఫలాన్ని ఇస్తుంది.

ఇంగువ,ఉల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగి,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినవద్దు ఇది ఈ మాసంలో నిషేదం, అంతేకాదు ఆదివారం రోజు కోబ్బరికాయ,ఉసిరికాయ తినకూడదు, ఇక కచ్చితంగా నేలమీద కూర్చొని భోజనం చేయాలి ఈ నెలరోజులు.

సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట మంచిది, అలాగే ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టాలి, తులసి కోటలో దీపము పెట్టుట మంచిది, తులసి పూజ, గౌరీపూజ చేయడం వలన ఆ ఇంటికి చాలా మంచిది, ఇక రాత్రి పూట అస్సలు ఇళ్లు ఊడవకూడదు, ఇక శివలింగాలను రాత్రి పూట ఇంట్లో పూజ గదిలో ఉన్న ప్రతిమలను అస్సలు కదిలించకూడదు. స్నానం చేయకుండా పూలు కూడా కోయకూడదు అంత నిష్టగా ఉండాలి ఈ కార్తికమాసంలో.