కార్తీక మాసంలో నదీ స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా దీని ప్రాముఖ్యత

కార్తీక మాసంలో నదీ స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా దీని ప్రాముఖ్యత

0
92

కార్తీక మాసంలో నదీ స్నానాలు చేస్తూ ఉంటారు భక్తులు…ఈ నెల రోజులు పూజలకు పుణ్యకార్యక్రమాలకు ఎంతో ప్రసిద్ది, ఇక ఇలా నదీ స్నానాలు చేయడం వల్ల ఎంతో మంచిది, అంతేకాదు దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని పండితులు వైద్యులు చెబుతున్నారు.

నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్లు, పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. ఇలా స్నానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావు అంటున్నారు పండితులు, అయితే గతంలో ఇలా ఆ నీరు ఎంతో స్వచ్చంగా ఉండేది అనేది తెలిసిందే.

ఇప్పటికీ దీనిని చాలా ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు, ఇక ఈ సమయంలో ఈశ్వరుడికి ఉదయం దీపం పెట్టి శంకుపుష్పాలతో పూజించి పాలతో అభిషేకం చేస్తే మంచిది, ఆయనకు గంధం పూసి బిల్వ దళాలతో పూజిస్తే ఎంతో మంచిది అని పండితులు చెబుతున్నారు, ముఖ్యంగా వివాహం కావాలసిన వారు ఇలా ఉదయం స్వామిని దర్శించి దీపం వెలిగిస్తే మంచి వరుడితో వివాహం అవుతుంది అంటున్నారు.