వనభోజనాలు అంటే ఈ కార్తీకమాసంలోనే వినిపిస్తాయి, పెద్ద ఎత్తున ప్రాంతంలోని ప్రజలు వర్తకులకు సంబంధించి ఇలా వన భోజనాలు పెట్టుకుంటారు.. అయితే ఈ సమయంలో ఉసిరి చెట్టుకి ఎంతో ప్రాసశ్త్యం ఉంటుంది. ఎందుకు అంటే కార్తిక మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించేది ఉసిరి చెట్టుని, ఇలా ఉసిరి చెట్లు ఎక్కువ ఉన్నచోట తోటల్లో వనభోజనాలు జరిగేవి, కాని తోటలో ఇప్పుడు ఒక్కచెట్టు ఉన్నా అక్కడ వనభోజనాలు జరుగుతున్నాయి.
దీనికి కారణం కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ ఉసిరి చెట్టుదగ్గర కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు భూమిమీద పడ్డాయి, అలా ఉసిరి పుట్టింది, ఇక దీనిని భూమాతగా కొలుస్తాం, ఉసిరి చెట్టు ఎంతో ఔషద గుణాలు కలిగి ఉన్న చెట్టు అనేది తెలిసిందే.
వనభోజనాల్లో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షంతలు, పుష్పాలతో పూజించాలి. తర్వాత పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేయాలి.ఇలా చేస్తే చాలా మంచిది ఇక్కడ నోములు పూజలు వాయినాలు నోముల కథలు చదివేవారు ఉంటారు, ఎవరి శక్తి కొలది వారు చేసుకోవచ్చు..ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత నైవేధ్యం పెట్టి భోజనం చేయాల్సి ఉంటుంది.