సమాజంలో కొన్ని విషయాల్లో మార్పు వచ్చింది… కాని పగలు ప్రతీకారాల్లో కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. చిన్న చిన్న విషయాలకు కూడా చావడం చంపడం చేస్తున్నారు కొందరు.. ఏకంగా ప్రేమించలేదు అని అమ్మాయిలపై అబ్బాయిలు దాడులు చేసిన ఘటనలు చూశాం …ఇప్పుడు అమ్మాయిలు కూడా ఈ విషయాల్లో తిరగబడుతున్నారు.. మేము కూడా ప్రేమించిన వాడు తిరగబడితే వారిని అంతం చేస్తాం అంటున్నారు.
అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు… కాని వారి మధ్య ఏదో చిన్న వివాదం వచ్చింది. దీంతో ప్రేమించిన వ్యక్తిపైనే పగ పెంచుకున్న ఓ యువతి అతడిపై హత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇది ఇప్పుడు సంచలనం అయింది
వెంటనే అతనిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, అసలు వీరి మధ్య వివాదం ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రియుడిపై ఇలా పెట్రోల్ పోసింది అనే విషయం పై వివరాలు అడుగుతున్నారు పోలీసులు, ఇప్పుడు ఈకేసు పెను సంచలనంగా మారింది.