కాటికాపరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు వారి బాధలు చూడండి

కాటికాపరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు వారి బాధలు చూడండి

0
110

కరోనా సోకి ఎవరైనా చనిపోతే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు జనం.. అలాంటిది కాటి కాపర్లు వందల సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూవస్తున్నారు, కానీ వారిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదట… కరోనా పోరులో తాము ముందు ఉన్నాము అని తెలియచేస్తున్నారు…పని ఒత్తిడి చాలా పెరిగింది అంటున్నారు.. రోజుకి 18 గంటలు పని చేస్తున్నారట.

 

తినడానికి సమయం కూడా దొరకడం లేదని ఎంతో ఖాళీ లేని ఒత్తిడి మాపై ఉంది అని చెబుతున్నారు…ఢిల్లీ శ్మశాన వాటికలలో పనిచేసే సిబ్బందికి పని ఒత్తిడి విపరీతంగా ఉంటోంది… తమకు తమ కుటుంబాలకు కరోనా ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక కాటి కాపరులు అందరికి కచ్చితంగా వ్యాక్సిన్ వేయాలి అని కోరుతున్నారు.

 

మాస్కులుగానీ, గ్లోవ్స్ గానీ అధికారులు ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు….గతంలో రోజూ 10 నుంచి 15 మృతదేహాలను మాత్రమే ఖననం చేసేవారట …కానీ ఇప్పుడు రోజూ 100 నుంచి 150 శవాలు వస్తున్నాయని కాటికాపరులు చెబుతున్నారు.. రోజు ఇప్పుడు 18 గంటలు పని చేస్తున్నామని చెబుతున్నారు.