కట్నం కోసం ఎంగేజ్ మెంట్ ఒకరితో పెళ్లి మరొకరితో

కట్నం కోసం ఎంగేజ్ మెంట్ ఒకరితో పెళ్లి మరొకరితో

0
96

డబ్బు కోసం కట్నం కోసం ఇంకా కొందరు వేధించే వారిని మనం సమాజంలో చూస్తున్నాం.. ఇక కట్నంలో కొంచెం నగదు తగ్గినా పెళ్లి జరగదు అని గతంలో పెళ్లి సమయానికి కొర్రెలు పెట్టేవారు పెళ్లికొడుకు వారు.. ఇలాంటి పరిస్దితులు ఇప్పుడు లేవు చాలా మంది కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు ..ఇటు అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఉద్యోగం చేస్తూ కుటుంబాలని చూసుకుంటున్నారు. కాని కొందరు మాత్రం ఆ కట్నాల కోసం వేదిస్తున్నారు.

 

తాజాగా ఓ వ్యక్తి కట్నం ఎక్కువిచ్చారని అంతుకు ముందు నిశ్చితార్ధం చేసుకున్న సంబంధం కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇతను చేసిన పనికి స్ధానికులు కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు, మంచి ఉద్యోగం పెట్టుకుని ఇలా కట్నం కోసం మోసం చేయడం ఏమిటి అని విమర్శలు చేస్తున్నారు.

 

ఇక దీనిపై ముందు నిశ్చితార్దం జరిగిన వారు ఆ అబ్బాయి కుటుంబాన్ని ప్రశ్నిస్తే …ఈ విషయం చెప్పాడు.. అతనిపై అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక ఇలాంటి వాడితో పెళ్లి ఎందుకు అమ్మా రేపు ఇంకో లక్ష ఎవరైనా ఎక్కువ ఇస్తే మరొకరిని పెళ్లి చేసుకుంటాడు అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.