కేరళ గర్భిణి ఏనుగుకి పైనాపిల్ కాదు ఈ కాయ ఇచ్చారు దుర్మార్గులు

కేరళ గర్భిణి ఏనుగుకి పైనాపిల్ కాదు ఈ కాయ ఇచ్చారు దుర్మార్గులు

0
86

దుర్మార్గం అమానుషం జరిగింది ఇటీవల, కేరళ గర్భిణి ఏనుగు హత్యోదంతంలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. ముగ్గురు నిందితుల్లో ఒకడిని పట్టుకున్న పోలీసులు అతని ద్వారా నిజాలను కక్కిస్తున్నారు..పాలక్కాడ్ జిల్లాలో ఏనుగు పైనాపిల్ పండును తినలేదని చెబుతున్నారు నిందితులు.

ఆ ఏనుగు కొబ్బరికాయలో పటాసులు కొరికింది అని విచారణలో తేలింది, ఆ పటాసులు ఉన్న కొబ్బరి కాయ కొరకడంతో అది పేలి దాని దవడకు బాగా గాయం అయింది. ఈకేసులో ముగ్గురిని విచారణ చేస్తున్నారు పోలీసులు.

నిందితుడు విల్సన్ పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు సమాచారం. ప్లాంటేషన్ షెడ్డులో విల్సన్ పటాసులు తయారీ చేస్తున్నాడు. మిగతా వారికి కూడా నేర్పుతున్నాడు.. అయితే ఇక్కడ వీరు కావాలనే పెట్టి దానికి ఇచ్చారా లేదా అనేది విచారణ చేస్తున్నారు, ఇక్కడ జంతువులు పొలాలు తోటలు పంటల్లోకి రాకుండా ఇలా పేలుడు పదార్దాలు పంటల్లో పండ్లతో కలిపి పెడతారు.