కేరళ ఏనుగు మృతిలో సరికొత్త ట్విస్ట్ జరిగింది ఇది

కేరళ ఏనుగు మృతిలో సరికొత్త ట్విస్ట్ జరిగింది ఇది

0
108

యావత్ ప్రపంచం అంతా కన్నీరు పెట్టింది కేరళలో ఏనుగు మృతితో, ఇలా గర్భంతో ఉన్న ఏనుగుని ఎలా చంపేశారు అని అందరూ బాధపడ్డారు, పైనాపిల్ లో బాంబు పెట్టి దానికి అందించారు అని భావించారు, కాని అసలు అక్కడ వారిని అందరిని విచారణ చేయగా ఆ పండు ఏమిటి అసలు ఏమైంది అనేది తెలుసుకున్నారు అధికారులు.

ఈ సమయంలో ఆ ఏనుగు తిన్నది పైనాపిల్ కాదు, అది కొబ్బరికాయ, అందులో పేలుడు పదార్దాలు ఉండటంతో అది పేలి ఒక్కసారిగా దానికి గాయం అయింది..ఆ ఏనుగు ప్రమాదవశాత్తూ పేలుడు పదార్థాలను కలిపిన ఆహారాన్ని తిందని ప్రాధమిక దర్యాప్తులో స్థానిక పోలీసులు తేల్చారని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది.

తమ పొలాల్లోకి అడవి పందులు చేరకుండా నిలువరించేందుకు కొందరు స్థానికులు ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన పండ్లను ఎరగా వేస్తారని, అటువంటి ఒక పండునే ఈ ఏనుగు తిన్నదని విచారణలో తేలింది, ఎవరూ నేరుగా దానికి ఆ పండు ఇవ్వలేదు , పొలంలో ఆ పండు తింది, అయినా ఎవరైతే అది పెట్టారో వారిని వదలకుండా శిక్షిస్తామని తెలిపారు అధికారులు
ఆ ఏనుగు వయసు 15 సంవత్సరాలని, గర్భంతో ఉన్నదని తెలిపారు.