తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..టీచర్లకు శిక్షణ తరగతులు

0
95

తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రైమరీ టీచర్లకు ఈ నెల 26 నుంచి 28 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్ అండ్‌ ట్రైనింగ్‌) డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐఆర్‌డీలో ఈ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడం, సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం, సులభ పద్ధతిలో గణితం అర్థమయ్యేలా బోధించడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

ఈ తరగతులకు ప్రతిజిల్లా నుంచి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం టీచర్లు నలుగురు, ఉర్దూలో నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ నెల 21లోపు పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. వివరాలకు tgscertct@gmail.comలో సంప్రదించాలని సూచించారు.