మానవ సంబంధాలు అతి దారుణంగా చెడిపోతున్నాయి, క్షణిక సుఖాల కోసం డబ్బు కోసం ఏ పని చేయడానికి అయినా వెనుకాడటం లేదు, తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా చంపేసింది ఓ యువతి, 20 రూపాయల కోసం ఆ చిన్నారిని ఏకంగా బావిలోకి తోసింది యువతి, ఇది కర్ణాటక జిల్లా బెళగావిలో జరిగింది.
గ్రామానికి చెందిన చిన్నారి దివ్య రూ.20 తీసుకుని బిస్కెట్లు కొనుక్కునేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లింది. దారిలో పూజ అనే యువతి… చిన్నారి చేతిలో ఉన్న రూ. 20 చూసి లాక్కుంది. దీంతో ఆమె 20 ఇవ్వమని రోడ్లుపైనే ఏడ్చింది కాని పూజ మాత్రం ఇవ్వలేదు..
దీంతో పాప ఏడుపు ఆపడం లేదు… ఇక 20 రూపాయలు ఇస్తాను రా అని తీసుకువెళ్లి, పక్కన ఉన్న బావిలోకి పాపని తోసేసింది, ఇలా విషయం తెలుసుకుని తల్లిదండ్రులు స్ధానికులు వచ్చేశారు.. కాని పాపని బయటకు తీసే సరికి ఆమె నీరుమింగి ఊపిరాడక చనిపోయింది, దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.