కొడుకులకు పెళ్లిళ్లు చేయాల్సిన వయస్సులో ఉన్న ఒక ఆంటీ తన ప్రియుడితో లేచిపోయింది… దీంతో అవమానంతో ఇద్దరు కుమారులు తల్లి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయారు… ఈ సంఘటన తమిళనాడు పుదుకోటలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పుదుకోట నామన సుముద్రం ప్రాంతానికి చెందిన వెంకటచలం జయదీప దంపతులు వీరికి విఘ్నేశ్వరన్ యోగేశ్వరన్ అనే ఇద్దరు కూమారులు ఉన్నారు.. ఒకరు డిగ్రీ ఫైనల్ ఇయర్ మరోకరు రెండవసంవత్సరం చదువుతున్నారు… తండ్రి అనారోగ్య కారణంతో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు… దీంతో తల్లి తన కుమారులతో ఉంటుంది…
అయితే రెండు రోజుల క్రితం తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో లేచిపోయింది…. దీంతో అవమానంతో కుమారులు ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందారు… ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు…