గుజరాత్ లో కిలాడి లేడీ ఏకంగా తన మాయతో ఓ కిరాణా షాపు యజమానిని తన బుట్టలో వేసుకుంది.. ఆమెకి భర్త లేకపోవడంతో ఇక ఈ వ్యాపారితో అఫైర్ పెట్టకుంది.. రాత్రి 9 కి షాపు క్లోజ్ చేశాక ఆమె ఇంటికి వెళ్లి రెండు గంటలు ఉండి ఇంటికి వెళ్లేవాడు, మొత్తానికి భార్యకి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు, అయితే ఇటీవల ఆమె తరచూ తన అందాన్ని ఎర వేసి మొత్తానికి అతని నుంచి భారీగా నగదు తీసుకుని బంగారం కొనుగోలు చేసింది.
ఇక వీరి రాసలీలలు అన్నీ వీడియో తీసి చివరకు అతిని బ్లాక్ మొయిల్ చేసింది, ఇక మరో ప్రాంతంలో ఓ షట్టర్ అద్దెకు తీసుకుని అతని నుంచి భారీగా సరుకు ఆటోలో తీసుకువెళ్లేది ఇలా సుమారు హోల్ సేల్ షాపుని రిటైల్ షాపు గా చేసి దాదాపు 65 లక్షల సరుకు తీసుకువెళ్లి దానిని తక్కువరేటుకు అక్కడ అమ్మేసింది.
ఈ నగదుతో తన ఊరిలో రెండు ఇళ్లు కొనేసింది.. దీంతో అప్పులు పెరగడంతో అతను విషం తాగాడు…చివరకు వ్యాపారి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు పెట్టింది.. పోలీసులు విచారణలో ఇప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి, ఇక అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు, అతని కుమారులు ఇద్దరు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నారు, తండ్రి పరిస్దితి తెలిసి ఇద్దరు అక్కడ నుంచి బయలుదేరారు, ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది.