కొబ్బరిబొండాలే విద్యార్దుల ఫీజు – ప్రపంచంలో మొదటిసారి

కొబ్బరిబొండాలే విద్యార్దుల ఫీజు - ప్రపంచంలో మొదటిసారి

0
92

కరోనా వైరస్ చాలా మంది జీవితాలని నాశనం చేసింది, అంతేకాదు లాక్ డౌన్ తో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు, అలాగే వారు ఉద్యోగం వ్యాపారం కూడా లాస్ అయ్యారు.. ఇక విద్యారంగం ఎంతో దెబ్బతింది. ఏడు నెలలుగా స్కూళ్లు ఓపెన్ అవ్వలేదు, ఇటు టీచర్లకు కూడా జీతాలు ఇవ్వలేని స్దితి.

ఇక పేరెంట్స్ కూడా ఉపాధి లేక ఫీజులు కట్టలేని స్దితిలో ఉన్నారు.ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే వారి బాధలు వర్ణణాతీతం. ఇలాంటి దారుణమైన స్దితిలో పేరెంట్స్ కష్టాలను గమనించిన ఓ హాస్పిటాలిటీ కళాశాల మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది, ఇక విద్యార్దులు పీజులు కట్టక్కర్లేదు.
ఇలా ఫీజుకి బదులు కొబ్బరి బొండాలు ఇస్తే సరిపోతుందని తెలిపింది.

ఇది ఎక్కడ అంటే బాలీలో తీసుకున్న నిర్ణయం, దీని వెనుక స్టోరీ ఏమిటి అంటే, బాలిలోని టెగలాలాంగ్లోని వీనస్ వన్ టూరిజం అకాడమీ తన విద్యార్థుల ట్యూషన్ ఫీజును నగదుకు బదులు కొబ్బరికాయల రూపంలో చెల్లించడానికి అనుమతించింది. ఇలా వచ్చిన కొబ్బరితో నూనె కొబ్బరి వస్తువులు తయారు చేస్తారు ఈ అకాడమీ ద్వారా , అంతేకాదు కొబ్బరితో పాటు మోరింగా, గోటు కోలా అనే ఔషధ మొక్కల ఆకులను కూడా తీసుకువస్తే ఫీజు నగదు కింద జమచేస్తారు, వీటితో సబ్బులు తయారుచేస్తారు, దీంతో చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఇవి ఇచ్చి చేరుతున్నారు.