కొడుకు బుద్ది తెలిసి ఆస్ప‌త్రి పాలైన తండ్రి ?

కొడుకు బుద్ది తెలిసి ఆస్ప‌త్రి పాలైన తండ్రి ?

0
91

చిన్న కొడుకుని ఆ తండ్రి ఇంజ‌నీరింగ్ చ‌ద‌వించాడు, అత‌ను మంచి ఉద్యోగం వ‌చ్చి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, ఇటీవ‌ల వివాహం కూడాచేసుకున్నాడు, అయితే కేవ‌లం మూడు ఎక‌రాల పొలం ఉండ‌టంతో కూతురికి ఒక ఎక‌రం పెద్ద కుమారుడిక ఒక ఎక‌రం, చిన్న‌కుమారుడికి ఒక ఎక‌రం ఇవ్వాలి అని తండ్రి అనుకున్నాడు.

కాని పెద్ద కొడుకు మాత్రం రెండు ఎక‌రాలు నాకే ఇవ్వాలి అని అన్నాడు, అంతేకాదు త‌మ్ముడ్ని బాగాచ‌దివించావు కాబ‌ట్టి వాడికి పొలం వ‌ద్దు అన్నాడు, నువ్వు చ‌దువుకోలేదు అలా అని వాడికి మోసం చేయ‌ను అన్నాడు.. తండ్రి మాత్రం నా ఆస్తి ముగ్గురికి స‌మానంగా ఇస్తాను అన్నాడు, అయితే కావాల‌నే పెద్ద కొడుకు ఓ ప‌న్నాగం ప‌న్నాడు.

అత‌ను బ‌య‌ట అప్పులు చేసిన‌ట్లు నాట‌కం ఆడాడు.. పేకాట బెట్టింగ్ లో డ‌బ్బులు అప్పు తీసుకున్నాడు అని కొంద‌రిని సృష్టించి ఇంటికి పంపించాడు.. అయితే చివ‌ర‌కు పెద్ద కొడుకుని కోడ‌లిని పిల్ల‌ల‌ని చూసి తండ్రి ఎక‌రం పొలం తాక‌ట్టు పెట్టి ఆ న‌గ‌దు ఇప్పించాడు, త‌ర్వాత ఆ న‌గ‌దు నేనే తీరుస్తా అని చెప్పి, దానిని వారికి తిరిగి ఇచ్చి ఆరెండు ఎక‌రాలు తానే స్వాధీనం చేసుకున్నాడు, త‌ర్వాత ఈ విష‌యం బ‌య‌టవారి ద్వారా తండ్రికి తెలియ‌డంతో ఈ మోసం విని ఆయ‌న ఆస్ప‌త్రి పాల‌య్యాడట‌.