ఈ రోజుల్లో యువత ప్రేమించుకుంటున్నారు ఇక ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత పెద్దలు ఏమి అవుతారు అనేది వారు ఆలోచించడం లేదు, ఇక పెద్దలు కూడా పిల్లల ప్రేమని అర్దం చేసుకోవడం లేదు. ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది… అయితే ఓ ఇంట్లో పెను విషాదం జరిగింది.
ప్రేమ పేరుతో తమ కుమార్తెను తీసుకువెళ్లాడనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. అతని వయసు 23 ఏళ్లు ఆమె అతని కంటే ఆరు నెలలు చిన్నది.. అయితే ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు, ఇక పెద్దలు పెళ్లికి ఒప్పుకోరు అని పారిపోయి వివాహం చేసుకున్నారు.
అయితే తమ కుమార్తెకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఇంటినుంచి తీసుకువెళ్లిపోయాడని, మీ కారణంగా తమ పరువు పోయింది అని ఆ యువకుడి ఇంటిపై రాళ్లదాడి చేశారు అమ్మాయి కుటుంబం వారు…దీంతో ఆ యువకుడు తండ్రి ఆ ఇంటిలో ఉన్నాడు.. ఆ రాళ్ల దెబ్బలు తగిలి ఆ వ్యక్తి మరణించాడు.. చివరకి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.