కోపంతో భార్య తల మొండెంను వేరు చేసిన భర్త…

కోపంతో భార్య తల మొండెంను వేరు చేసిన భర్త...

0
153

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ఎన్ఎస్పీ అతిథిగృహం వద్ద దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ భర్త కట్టుకున్న భార్యపై వేట కొడవలితో దాడి చేశాడు. భార్య మెడ నరికి ఆపై తల మొండెం వేరు, చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు.

వేరు చేసిన భార్య తలను తీసుకొని నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అర్ధ రాత్రి 12 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భార్య ను భర్త శ్రీనివాసరావు అడ్డగించాడు…

ఆమెను దారుణంగా హత్య చేశాడు. నిందితుడు ఎన్ఎస్పీ కెనాల్స్ లో ఉద్యోగిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి ని అదుపులోకి తీసుకున్నారు.