కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలుచుకున్నాడు – ఇప్పుడు దారుణస్దితిలో ఉన్నాడు కారణం ?

కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలుచుకున్నాడు - ఇప్పుడు దారుణస్దితిలో ఉన్నాడు కారణం ?

0
106

కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమం ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే, అయితే ఇక్కడ ఫస్ట్
రూ.5 కోట్లు సంపాదించిన యువకుడు సుశీల్ కుమార్ అందరికి తెలుసు.. ఇప్పుడు ఎలా ఉంటాడు అని మీరు భావిస్తున్నారు మంచి లగ్జరీ లైఫ్ వ్యాపారం చేస్తూ హాపీగా ఉన్నాడు అని అందరూ అనుకుంటారు..కాని ఇక్కడ సీన్ మారిపోయింది.

కరోడ్పతిలో రూ.5 కోట్లు గెలిచిన తర్వాత.. మంచి లక్షణాలన్నింటినీ కోల్పోయి దురలవాట్లకు దగ్గరై గొప్ప జీవితాన్ని కోల్పోయానంటున్నాడాడు ఈ విన్నర్ ..బిహార్ తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహరికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ సుశీల్ కుమార్.. 2011 లో కౌన్ బనేగా కరోడ్పతిలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి కేబీసీలో రూ.5 కోట్లు గెలిచిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కాడు.

అయితే ఆ వచ్చిన డబ్బుతో సిగరెట్లు మద్యం ఇతర అలవాట్లు చేసుకున్నాడు, ఇక ఏ పని చేయకుండా అలాగే ఉన్నాడు, పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు కొందరిని నగదు ఇచ్చాడు అన్నీంటా లాస్ వచ్చింది, ఇప్పుడు సాధారణ జీవితం బతుకుతున్నాడు, వీటి వల్ల తన భార్యతో విడాకుల వరకూ వెళ్లాడు, చివరకు ఇప్పుడు 10 మంది విద్యార్దులకి పాఠాలు చెబుతున్నాడు,సుశీల్ కుమార్ జీవితం చాలా మందికి ఓ లెసెన్ గా మారింది అంటున్నారు అందరూ.ప్రముఖ వ్యక్తిగా ఉండటం కంటే మంచి మానవుడి గాఉండటం వెయ్యి రెట్లు మంచిదంటున్నారు సుశీల్ కుమార్. ఇవన్నీ ఫేస్ బుక్ లో తన వాల్ పై రాశారు, అయితే గత ఏడాది సిగరెట్లు మద్యం మానేశాడట.