కుంకుమ పువ్వు ఎలా పండిస్తారో తెలుసా?

కుంకుమ పువ్వు ఎలా పండిస్తారో తెలుసా?

0
92

మన ప్రపంచంలో రేకలుగా తీసుకుంటే కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది.. కిలో రెండున్నర లక్షల నుంచి మూడులక్షల వరకూ ధర పలుకుతుంది..శాఫ్రాన్ తోటలు మన దేశంలో కశ్మీర్ లో మాత్రమే ఉన్నాయి, ఇక శాఫ్రాన్ తోటల్లో ఆకులు పెద్దగా కనిపించవు. పువ్వులు మాత్రమే కనిపిస్తాయి. ఈ పువ్వుల్లోనే ఈ కుంకుమపువ్వు ఉంటుంది.

ఈ పువ్వులో మూడే అండకోశాలు ఉంటాయి. అవే కుంకుమపువ్వులు.. పువ్వు విచ్చుకున్న వెంటనే కోస్తేనే శాఫ్రాన్ నాణ్యత బాగుంటుంది. ఒక్క అరగంట లేట్ చేసినా ఆ లోపల రేకులు వాడిపోతాయి దానికి ధర రాదు,రంగు రుచి కోల్పోతుంది.

రోజూ ఉదయాన్నే విచ్చిన పువ్వుని విచ్చినట్లుగా కోస్తుంటారు. ఈ పువ్వులన్నీ ఒకచోట పోసి వాటిల్లోని అండకోశాలని చేత్తో తీసి ఎండబెట్టి భద్రపరుస్తారు. ఇలా కోసిన పూల రేకలు అమ్ముతారు, ఇక ఇందులో రేకలకు మరే ప్రాసెసింగ్ చేయరు, మూడు లక్షల వరకూ ధర పలుకుతుంది కిలో కుంకుమ పువ్వు.. కిలో కుంకుమ పువ్వుకి కొన్ని లక్షల పువ్వులు కోయాలి ఎంతో పెద్ద పని అంటున్నారు వ్యాపారులు.