కశ్మీర్ బంగారం అంటే ఏమిటో తెలుసా మనం అప్పుడప్పడూ వింటూ ఉంటాం కదా అదే కుంకుమపువ్వు.. అసలు కుంకుమ పువ్వు పేరు చెప్పగానే అందరికి కశ్మీరే గుర్తొస్తుంది, దీనిని చాలా మంది పాయసం, హల్వా, బిర్యానీలో వాడతారు, మంచి సువాసన కలర్ వస్తుంది.
అయితే ఇది నిజంగా కశ్మీర్ లోనే పండుతుందా? ప్రపంచంలో ఎక్కువ దొరికేది ఇక్కడేనా అసలు కుంకుమ పువ్వు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..శాఫ్రాన్ స్వస్థలం కశ్మీర్ కాదు, దీనిని క్రీ.పూ. 500 కాలంలో పర్షియన్లు తీసుకొచ్చి నాటారు. ఎత్తయిన ప్రదేశం కావడం, చలితో కూడిన పొడి వాతావరణం వల్ల , సారవంతమైన నేల కారణంగా కశ్మీరులో కుంకుమపువ్వు పెరుగుతుంది.. ముదురు ఎరుపు రంగులో పొడవుగా మందంగా పెరిగి ఘాటైన రుచినీ సుగంధాన్నీ ఇస్తుంది.
ప్రపంచానికి అవసరమైన శాఫ్రాన్లో 90 శాతం ఇరానే అందిస్తుంది.కశ్మీరీ కేసర్ గా దీనిని పిలుస్తారు, ఒరిజినల్ కుంకుమ పువ్వు ఎలాంటి కల్తీ లేకుండా ఉంటే కిలో 3 లక్షలు ఉంటుంది, అంతకంటే తక్కువగా లక్ష లేదా 50 వేలకు వస్తుంది అంటే అది కచ్చితంగా నాణ్యత లేనిది అని చెబుతున్నారు ఇక్కడ వ్యాపారులు.ఇరాన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, సిసిలీ, టర్కీ, ఆఫ్ఘనిస్థాన్ లో శాఫ్రాన్ తోటలు ఎక్కువ ఉన్నాయి.