కూతురు పెళ్లికి దాచిన కట్నం డబ్బులు – ఈ రైతు ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే

కూతురు పెళ్లికి దాచిన కట్నం డబ్బులు - ఈ రైతు ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే

0
94

కరోనా దేశంలో విజృంభిస్తోంది ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.. వందల మరణాలు సంభవిస్తున్నాయి…ఇప్పటికే అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక ఈ సమయంలో చేతిలో ఉన్న నగదుని దేనికి ఖర్చు చేయడం లేదు.. ఇప్పుడు ఈ నగదు చాలా ముఖ్యం అని సేవ్ చేసుకుంటున్నారు…ఈ సమయంలో ఎక్కడ ఆస్పత్రికి నగదు అవసరం అవుతుందా అని దాచుకుంటున్నారు.

 

ఒక రైతు మాత్రం తన కూతురు వివాహం కోసం దాచిన 2 లక్షల రూపాయల సొమ్మును ఆక్సిజన్ కొనుగొలు చేయడానికి జిల్లా కలెక్టర్కు విరాళంగా ఇచ్చాడు… ఇప్పుడు అతను చేసిన మంచి పనికి అందరూ కూడా ఆయనని అభినందిస్తున్నారు.. ఆ రైతు చేసిన సాయం వల్ల పదుల సంఖ్యలో కరోనా రోగులకి ఆక్సిజన్ అందుతుంది. ఆ నగదుతో వారి ప్రాణాలు నిలబెట్టినట్టే.

 

నిజంగా ఆ గొప్ప మనసు తెలుసుకుని అందరూ ఆ రైతుని అభినందిస్తున్నారు.మధ్యప్రదేశ్లోని గ్వాల్ దేవియన్ గ్రామానికి చెందిన చంపలాల్ గుర్జార్ అనే రైతు రూ.2 లక్షలను కూతురు పెళ్లి కోసం దాచాడు..కూతురు అనిత సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తింది. నిజంగా అతనిని అభినందిచాల్సిందే.