కూతురు ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాడో తెలిసి – గుండెనొప్పితో చనిపోయిన అమ్మాయి తండ్రి

కూతురు ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాడో తెలిసి - గుండెనొప్పితో చనిపోయిన అమ్మాయి తండ్రి

0
114

కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు.. కుమార్తె తన పేరు నిలబెడుతుంది అని భావించాడు ..కాని ఆమె చేసిన పనికి ఏకంగా గుండె పగిలి చనిపోయాడు నందన్ ..తన కుమార్తె మయూరిని ఇంజనీరింగ్ చదివించాడు.. ఇక తను కూరగాయలు అమ్ముతూ ఆ వచ్చే డబ్బుతోనే ఒక్కగానొక్క కుమార్తెని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు, అయితే ఆమె రెండు సంవత్సరాలు బాగానే చదువుకుంది.. మూడో ఏడాది నుంచి ఆమె మాట తీరు పద్దతి అన్నీ మారాయి.

 

ఇక సాధారణమే అనుకున్నాడు తండ్రి.. ఇక ఇటీవల అతనికి ఆమె ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది.. దీంతో అతను ఎంతో కుంగిపోయాడు ఉద్య్యోగం చేసి తన పేరు నిలబెడుతుంది అనుకుంటే ఆమె చేసిన పనికి షాక్ అయ్యాడు.. వారం నుంచి కూరగాయల వ్యాపారానికి వెళ్లడం లేదు దుకాణం తీయాలి అని అతనికి అనిపించలేదు.

 

అయితే పోలీసులు అతన్ని సడెన్ గా పిలవడంతో స్టేషన్ కు వెళ్లాడు… అక్కడ కుమార్తె ప్రియుడు వివాహం చేసుకున్నారు, దీంతో ఏమీ చేయలేక ఇంటికి వచ్చాడు, అయితే రాత్రి సమయంలో పలువురు ఇంటి మీదకు వచ్చి గొడవ చేశారు, ఆ ప్రియుడికి ఆల్రెడీ వివాహం అయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారు అని తేలింది.. పైగా అతనుట్రక్కు నడుపుతాడు అని తెలిసింది.. దీంతో కుమార్తె ఆ కుటుంబం షాక్ అయ్యారు, ఈ వార్త విని అక్కడికక్కడే గుండెపోటుతో అతను కుప్పకూలిపోయాడు.. రాజంపూర్ లో ఈ ఘటన ఒక్కసారిగా ఎంతో విషాదాన్ని నింపింది.