చాలా మంది ఎంత కష్టపడినా తమకు లక్ష్మీ కటాక్షం లేదు అని చాలా బాధపడతారు, అయితే చేసిన పనిలో ఎంతో ఏకాగ్రత ఉన్నా సమయం కలిసి రావడం లేదు అంటారు, అయితే కచ్చితంగా మీరు చేసే పనిలో విజయం రావాలి అంటే మీకు నరగోల ఉండకూడదదు, అలాగే లక్ష్మీ కటాక్షం ఉండాలి. అప్పుడే విజయం వస్తుంది వచ్చిన నగదు నిలబడుతుంది.
మరి ఇంట్లో నగదు ఉండాలి అన్నా లక్ష్మీ కటాక్షం ఆ కుటుంబానికి ఉండాలి అంటే ఏం చేయాలి అనేది పండితులు ఏమి చెబుతున్నారు అంటే.దక్షిణావర్త శంఖం, ముత్యాల శంఖం, ఏకాక్షి నారికేళం, మారేడుకాయ, పసుపు,కుంకుమలు, తాటాకు, వెండి లేదా బంగారు లక్ష్మీదేవి ప్రతిమ, పసుపు రవికె, సింహసనంలో వెండి కమలం, లేదా బంగారు కమలం ఉండాలి. ఇవన్నీ దేవుని మందిరంలో ఉంచండి.
కచ్చితంగా మంగళవారం, శుక్రవారం లక్ష్మీదేవికి క్షీరాన్న నైవేథ్యం పెట్టాలి, కొత్త పువ్వులతో అలంకరించి ఉదయం స్నానం చేసి అమ్మవారికి పూజ చేస్తే శుభం కలుగుతుంది.. ఇంటిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.. భార్య ఉదయం ఈ పని చేస్తే భర్తకు అన్నింటా విజయం వస్తుంది, ఇక ఇంటి గుమ్మం ముందు లక్ష్మీ దేవి విగ్రహం పటం ఉంచుకున్నా చాలా మంచిది. ఈ వస్తువులను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది.