NCS గ్రూప్ ఆధ్వర్యంలో రెండు కొత్త ప్రాజెక్టులు ప్రారంభం

0
123

ఎన్.సి.ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్.సి.ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్, ఎన్.సి.ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ రెండు కొత్త ప్రాజెక్ట్ లను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నేషనల్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణయ్య కలిసి ప్రారంభించారు. అంతేకాదు మాకు సినిమాపై ఉన్న ఇష్టంతోనే ఎన్.సి.ఎస్ ఎంటరైన్మెంట్ బ్యానర్ ని స్థాపించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు ప్రియాంక, సురభి, సాయి కృష్ణ మరికొంత మంది పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎన్.సి.ఎస్ గ్రూప్ నిర్వాహకులు మాట్లాడుతూ..ఎన్.సి.ఎస్ గ్రూప్ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తుంది. ఎన్.సి.ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ పేరుతో హైదరాబాద్ లోని షాదనగర్ దగ్గర బూర్గుల విలేజ్ లో 75 ఎకరాల్లో, ఎన్.సి.ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ పేరుతో విజయవాడ బందరు రోడ్డులోని ఇడుపుగళ్లులో మరో ప్రాజెక్ట్ ప్రారంభించాం.

అంతేకాకుండా మాకు సినిమాపై ఉన్న ప్యాషన్ తో నే ఎన్.సి.ఎస్ ఎంటరైన్మెంట్ బ్యానర్ ని స్థాపించామని. మా బ్యానర్ లో మొట్టమొదటి సినిమా ‘ఏమంటివి ఏమంటివి’ త్వరలో రాబోతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో సంస్థ నిర్వహకులు చంద్ర శేఖర్, ఎంబి సత్య నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి,శేషు రెడ్డి పాల్గొన్నారు.