కొత్త వాహనాలకు నిమ్మకాయ ఎర్రటి మిర్చి ఎందుకు కడతారో తెలుసా

కొత్త వాహనాలకు నిమ్మకాయ ఎర్రటి మిర్చి ఎందుకు కడతారో తెలుసా

0
97

కొత్తగా బండి లేదా కారు కొనుగోలు చేస్తే కచ్చితంగా చాలా మంది గుడికి తీసుకువెళ్లి పూజ చేయిస్తారు, అంతేకాదు నిమ్మకాయలు ఎర్రటి మిరపకాయలు కట్టి అప్పుడు ముందుకు తోలుతారు, అయితే ఇలా ఎందుకు చేస్తారు దీని వెనుక రీజన్ ఏమిటి అంటే, ఇలా చేస్తే బండికి దిష్టి ఉండదు, అలాగే నరగోల ఉండదు అని చెబుతారు.

అంతేకాదు వాహానానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది అని అందుకే ఇలా పూజ చేస్తారు అని పెద్దలు చెబుతారు, ఇంకొందరు గుమ్మడికాయకొట్టి దిష్టి కూడా తీస్తూ ఉంటారు. అయితే శాస్త్రం ప్రకారం ఏమి చెబుతున్నారు అంటే.

గ్రహాలలో ఎర్రని, ఉద్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రం నమ్మకం. కుజునికి ఆదిదేవుడు హనుమంతుడు. అలానే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. వీరు అందరూ వాహనం నడిపే వ్యక్తిపై శాంతంగా ఉండాలి అని ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాలి అని ఇలా చేస్తారట. అందుకే హనుమాన్ ఆలయాల్లో వాహన పూజలు ఎక్కువ జరుగుతాయి.