శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

0
38

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీనితో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా… 57,751 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది.

మరో రెండు రోజులపాటు అదేస్థాయిలో వరద కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శనివారం ఉదయం 11.30 ప్రాంతంలో మూడు గేట్లు ఎత్తివేయడం ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరడంతో మూడు గేట్లను ఎత్తివేసి వరద నీటిన దిగువకు విడుదల చేశారు. ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

కుడి, ఎడమ గట్ల విద్యుత్‌ కేంద్రాల్లో కరెంట్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్‌ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.