ఆ రాష్ట్రంలో ఖైదీలకు రుణాలు..

0
108

మనము ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లోన్ వస్తే మనం ఎంతో ఆనందిస్తాము. కానీ లోన్ పొందడం అంతా తేలికైన పనికాదు. ముఖ్యంగా ఖైదీలకు లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంకు సహకరించదు. జైలు శిక్ష అనుభవించే వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది.

రానున్న కాలంలో ఖైదీలు కూడా లోన్ ని పొందొచ్చు. గ్యారంటీ లేకుండానే లోన్ పొందే వెసులుబాటు కల్పించారు. పైగా వడ్డీ కూడా తక్కువే. ఖైదీలకు రుణాలు లభిస్తుండటం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. కానీ ఈ అవకాశం కేవలం మహరాష్ట్ర ఖైదీలకే వర్తిస్తుంది.