లాక్ డౌన్ వేళ అక్ర‌మ సంబంధం భార్య బ‌య‌టపెట్టింది ఇలా

లాక్ డౌన్ వేళ అక్ర‌మ సంబంధం భార్య బ‌య‌టపెట్టింది ఇలా

0
177

ఈ వైర‌స్ దెబ్బ‌కి ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌టకు రాని ప‌రిస్దితి.. ఈ స‌మ‌యంలో అంద‌రూ ఇంటిలోనే ఉంటున్నారు, అయితే ఎమ‌ర్జెన్సీ సేవ‌లు అందించేవారు మెడిక‌ల్ ఉద్యోగుల‌కి మాత్రం ప‌ర్మిష‌న్ ఇచ్చింది ప్ర‌భుత్వం, అంతేకాదు ఫార్మా కంపెనీల‌కు కూడా పాస్ లు జారీ చేసి ఉద్యోగుల‌కి వెసులుబాటు ఇచ్చారు.

ఈ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి త‌న భార్య‌ని ఇంటిలో ఉంచి వేరే మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు, ఈ లాక్ డౌన్ వేళ‌, ప్రొడ‌క్ష‌న్ పెరిగింద‌‌ని అందుకే రెండు రోజుల‌కి ఓసారి ఇంటికి వ‌స్తున్నా అని భార్య‌కు చెప్పాడు, కాని అత‌ను వేరే మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకుని.. ఉద‌యం ఆఫీసులో ప‌ని చేసుకుని రాత్రి ఆమెతో ఉంటున్నాడు..

ఇక పిల్ల‌ల‌ను చూడాలి అనే కోరిక‌తో రెండు రోజులకి ఓసారి వ‌స్తున్నాడు. భార్య‌కి అనుమానం వ‌చ్చి అత‌ని కోలిగ్ ని అడిగింది, మీ భ‌ర్త ఉద‌యం 10 కి వ‌చ్చి 6 గంట‌ల‌కు వెళుతున్నాడు అని చెప్పారు, దీంతో అత‌నిపై అనుమానం వ‌చ్చి ఫోన్ చెక్ చేస్తే , ఫోటోలు కాల్ డేటా క‌నిపించింది.. దాంతో పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది, పోలీసులు త‌మ స్టైల్ లో కోటింగ్ ఇవ్వ‌డంతో బుద్దిగా ఉంటాను అని చెప్పాడు.