లాక్డౌన్లో భార్యాభర్తలపై ఈ నాలుగు రాష్ట్రాల్లో షాకింగ్ రిపోర్ట్

లాక్డౌన్లో భార్యాభర్తలపై ఈ నాలుగు రాష్ట్రాల్లో షాకింగ్ రిపోర్ట్

0
98

భార్య భర్తలు అన్నాక అనేక విషయాలలో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, కొందరు వాటినివెంటనే పరిష్కరించుకుంటారు, మరికొందరు దానిని సాగతీత చేస్తూ ఉంటారు, ఇక భార్యలని హింసించే భర్తలు ఉంటారు, ఈ సమయంలో ఓపిక సహనం నశిస్తే భర్తకి విడాకులు ఇచ్చి గుడ్ బై చెప్పాలి అని భార్యలు అనుకుంటారు.

ఇక లాక్ డౌన్ వేళ ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంట్లోనే భర్తలు ఉండటంతో గృహహింస కేసులు పెరుగుతున్నాయట.ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ గృహ హింస ఎక్కువగా ఉంది. ఆ తర్వాత హర్యానా రెండో స్థానంలో ఉంటే… ఢిల్లీ మూడో పొజిషన్లో ఉంది. తాజాగా ఓ సంస్ధ ఈ రిపోర్ట్ వెల్లడించింది.

ఇక రెండు నెలల లాక్ డౌన్ కాలంలో గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో 63 కేసులు హర్యానా నుంచి 79 కేసులొచ్చాయి. ఉత్తరాఖండ్ నుంచి ఏకంగా 144 కేసులొచ్చాయి. మొత్తం 28 రాష్ట్రాల్లో ఈ కేసులు చూస్తే ఈ మూడు స్టేట్స్ లో ఎక్కువ ఉన్నాయి, ఇలా వివాదం పెట్టుకుని వస్తే, చాలా వరకూ పోలీసులు పరిష్కరిస్తున్నారట, అయినా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయట…హిమాచల్ ప్రదేశ్, మిజోరంలో కూడా పలు కేసులు నమోదు అవుతున్నాయట.