లాక్ డౌన్ వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు చివరకు ఏమైందంటే

లాక్ డౌన్ వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు చివరకు ఏమైందంటే

0
111

ఈ లాక్ డౌన్ వేళ చాలా మంది తమ లవర్ ని చూడలేక ఇబ్బంది పడుతున్నారు, ఇలా ప్రియురాలిని చూడాలి అని చాలా మంది ప్లాన్స్ వేస్తున్నారు, వీరి లవ్ సీన్ తెలియక ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రియుడ్ని చితక బాదుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఓ యువకుడు తన ప్రియురాలి ఇంట్లోనే దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో సంచలనమైంది. కడలూరు జిల్లాలోని చిదంబరానికి చెందిన అన్భళగన్అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ వేళ రెండు నెలలుగా ఆమెని చూడలేదు, దీంతో ఆమెని చూడాలి అని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.

అతడి ప్రియురాలి తండ్రి, తల్లి, సోదరుడు ఇంట్లోనే ఉన్నారు. వారంతా కలిసి అతడిని పట్టుకుని నరికి చంపారు. దీంతో అతను అక్కడే చనిపోయాడు, తమ పరువు తీస్తున్నాడనే కోపంతో ఇలా చేశాము అని ఆ కుటుంబం లేఖ రాసి అక్కడ నుంచి పారిపోయింది.అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.