దాదాపు మన దేశం 40 రోజులుగా లాక్ డౌన్ లో ఉంది, ఈ సమయంలో ఎవరూ బయటకు రాని పరిస్దితి, అందరూ ఇంటిలోనే ఉంటున్నారు, ఉపాధి ఉద్యోగం ఎవరికి ఏమీ లేదు, అయితే ఈ సమయంలో కూలీ నాలీ చేసుకునే వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొందరు మాత్రం ఈ సమయంలో లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారు.
పైగా మద్యం షాపులు తెరచుకోవడంతో ఆ మత్తులో మరిన్ని దారుణాలకు చెలరేగిపోతున్నారు, ఇక క్రైమ్ రేట్ కూడా పెరిగింది అంటున్నారు, ఇక పలువురు తాగి వాహనాలు నడపడంతో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.
ఉత్తర ప్రదేశ్ లోని బరేలిలో లాక్ డౌన్ లో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణం చేస్తున్న ఓ హిజ్రాపై ఆ ఆటో డ్రైవర్ లైంగికంగా దాడి చేశాడు. ఆమెపై అత్యాచారం చేయాలి అని ప్రయత్నించాడు, ఆమె తప్పించుకుని ఆటో నెంబర్ గుర్తు ఉంచుకుంది, వెంటనే మిగిలిన హిజ్రాలకు ఈ విషయం చెప్పడంతో..అందరూ అక్కడకు చేరుకున్నారు… అతను కనిపించడంతో అతన్ని చెప్పులతో చితక్కొట్టారు.. వెంటనే పోలీసులకు అప్పగించారు.