బ్యాంక్ ఉద్యోగం కోసం చూస్తున్నారా?..ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Looking for a bank job? .. But good news for you

0
254

నిరుద్యోగులకు శుభవార్త. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 6 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డాటా సైంటిస్ట్‌, డాటా ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం ఖాళీలు: 15

అర్హతలు: డాటా సైంటిస్ట్‌ పోస్టుకు కంప్యూటర్‌ సైన్స్‌, డాటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌లో బీటెక్‌, బీఈ, ఎంటెక్‌, ఎంఈలలో ఏదో ఒకటి చేసి ఉండాలి. డాటా ఇంజినీర్‌ పోస్టుకు కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీలో ఇంజినీరింగ్‌ చేసి ఉండాలి. అభ్యర్థులు 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 6

వెబ్‌సైట్: bankofbaroda.in