S.B.I ఏటీఎం కార్డ్ పోయిందా ఇలా సింపుల్ గా పొందండి

Lost SB.I ATM Card get Like This Simple

0
118

మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీ ఐ . ఈ బ్యాంకుకి దేశంలో కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. అయితే మీరు ఎస్ బీ ఐ కస్టమరా మీ డెబిట్ కార్డ్ పోయిందా, మీరు ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. ఎంతో సులభంగా కొత్త కార్డును పొందవచ్చు. మరి ఈ ప్రాసెస్ ఏమిటో చూద్దాం.

ముందు మీ కార్డు పోగానే దానిని బ్లాక్ చేయాలి. ఎస్ఎంఎస్తో కానీ, రిజిస్టర్డ్ మొబైల్ నుంచి కానీ బ్లాక్ చేయాలి. ఆ తరువాతే కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి BLOCK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కార్డు చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676కు ఎస్ఎంఎస్ పంపాలి. ఇక మీ కార్డు బ్లాక్ అయింది అని ఓ మెసేజ్ మీకు వస్తుంది.

ఇక ఫోన్ కాల్ తో ఎలా అనేది చూద్దాం

18004253800, 1800112211 నంబర్లకు కాల్ చేయాలి. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ మీకు సందేశాలు ఇస్తుంది అవి అన్నీ ఫాలో అవుతూ బ్లాక్ చేయాలి