అమ్మాయి తనని ప్రేమించడంలేదని ప్రేమోన్మాది దారుణం

అమ్మాయి తనని ప్రేమించడంలేదని ప్రేమోన్మాది దారుణం

0
102

అబ్బాయిల ప్రేమలు ఇటీవల హద్దు దాటుతున్నాయి.. తన ప్రేమని అమ్మాయి ఒప్పుకోకపోతే చంపెయడానికి కూడా వెనుకాడటం లేదు.. వారి మనసుని కూడా అర్ధం చేసుకోకుండా వారిని చంపేస్తున్నారు కొందరు మనిషిరూపంలో ఉన్న పశువులు…. అంతా చూస్తుండగానే.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది, చివరికి తన గొంతును కూడా కోసుకుని ఆస్పత్రి పాలయ్యాడు.

విక్రమ్ పాండేసర్ అనే యువకుడు తన ఆఫీసులో పనిచేసే 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఈ సందర్భంగా తనని పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా ఆమె వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఆమెకి అతనిపై ప్రేమ లేదు అని చెప్పినా వినిపించుకోలేదు .. ఆమె వెంట పడుతున్నాడు, ఆఫీసు నుంచి వెళుతున్న సమయంలో ఆమెని మరోసారి పెళ్లి చేసుకోవాలి అని కోరాడు.

కాని ఆమె ఒప్పుకోలేదు.. దీంతో ఆమె గొంతు కోశాడు పక్కన వారు వెంటనే ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లారు, పక్కన అందరూ అతనిని పట్టుకోవడంతో అతను కూడా గొంతు కోసుకున్నాడు, ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ప్రాణాపాయం లేదు కాని ఇద్దరికి గొంతు దగ్గర గాయాలు కావడంతో చికిత్స తీసుకుంటున్నారు.. అతని చర్యని అందరూ విమర్శిస్తున్నారు అతనికి కఠినంగా శిక్ష విధించాలి అని కోరుతున్నారు.