ప్రేయసి ఆ మాట ఎత్తగానే ప్రియుడు పరార్….

ప్రేయసి ఆ మాట ఎత్తగానే ప్రియుడు పరార్....

0
71

ఒక యువతీ యువకుడు ప్రేమించుకున్నారు… పెళ్ళిచేసుకుందామని యువతి చెప్పే సరికి యువకుడు పారిపోయాడు.. ఈ
సంఘటన తిరుపతి రూరల్ లో జరిగింది… తిరుపతి రూరల్ అవిలాలకు చెందిన ఓ అమ్మాయికి కాలేజీలో కోర్లగుంటకు చెందిన చంద్రమౌళి అనే యువకుడు పరిచయం అయ్యాడు…

ఈ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది…. ఇక వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి కుటుంబసభ్యులకు తెలియడంతో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు…. చంద్రమౌళి కుటుంబ సభ్యులకు కూడా కలిశారు అయితే పెళ్ళికి వారు ఒప్పుకోలేదు…

దీంతో ఆయువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది… అదే సమయంలో తల్లిదండ్రులు చంద్రమౌళిని గుట్టుచప్పుడు కాకుండా బెంగుళూరుకు పంపించారు… దీంతో యువతి చంద్రమౌళి ఇంటిదగ్గర ధర్నాకు దిగింది… తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తోంది…