రాత్రి భోజనం చేశాక కునుకు తీశాడు ఆమె ప్రియుడు.. ఆనందంగా పడుకున్నాడు కాని తెల్లారి లేచి చూసేసరికి అంగం ప్రాంతంలో విపరీతమైన నొప్పి… ఏమిటా అని చూస్తే అక్కడ అంగం సగం మాత్రమే ఉంది… మంచం రక్తంతో నిండిపోయింది. ఆ నిద్ర మత్తులో తనకు ఆ నొప్పి తెలియలేదు… ఇక తెగిన అంగం కూడా ఎక్కడా కనిపించలేదు.. వెంటనే హాస్పిటల్లో చేరాడు.
తైవాన్లోని చాంగువా కౌంటీలోని జిహూ టౌన్షిప్లో నివసిస్తున్న 52 ఏళ్ల హువాంగ్ తన ప్రియురాలు పూంగ్తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఇక రాత్రి అతను చికెన్ నూడుల్స్ వైన్ లో కలుపుకుని తాగి పడుకున్నాడు, ఆ నిద్ర మత్తు వల్ల అతను ఏం జరిగిందో తెలియలేదు.
హువాంగ్ పురుషాంగాన్ని కోసింది అతడి ప్రియురాలే. అతడు వేరే అమ్మాయితో చనువుగా ఉంటున్నాడనే కారణంతో అతడు నిద్రలోకి జారుకున్న తర్వాత వంటగది నుంచి కత్తి తీసుకొచ్చి అతని అంగం కోసేసింది, అంతేకాదు టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసింది… ఇక ఇదంతా పోలీసుల ముందు చెప్పింది… అయితే అతనికి వైద్యం చేశారు… మూత్రం పోసేందుకు ఇబ్బంది లేదు అని తెలిపారు వైద్యులు.